ఖాదీ కార్పొరేషన్ డైరెక్టర్‌గా యడ్లపల్లి సాంబశివరావు

ఖాదీ కార్పొరేషన్ డైరెక్టర్‌గా యడ్లపల్లి సాంబశివరావు

GNTR: తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నేత యడ్లపల్లి సాంబశివరావుకు రెండు కీలక పదవులు దక్కాయి. ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఆయనను నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో మోతడక గ్రామంలో హర్షం వ్యక్తమైంది.