బెటాలియన్ వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
BDK: దుమ్ముగూడెం మండలం రాయగూడెం కూడలి వద్ద సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ వ్యాన్, బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో బొజ్జిగుప్పకు చెందిన కోర్సా రామ్మూర్తి (38) మరణించారు. భద్రాచలంలో కూలీ పనులు ముగించుకుని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వస్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎటపాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.