పాలిసెట్ దరఖాస్తుకు గడువు పెంపు
KRNL: పాలిటెక్నికల్ కోర్సులో చేరేందుకు నిర్వహించే పాలిసెట్‌కు దరఖాస్తు గడువు ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించినట్లు ఆలూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటనారాయణ ఇవాళ తెలిపారు. పాలిసెట్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుండగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు మరో 5 రోజులు అవకాశం కల్పించిందన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.