బస్సులో రూ.23 లక్షల చోరీ

NLG: నల్గొండ జిల్లాలో భారీ చోరీ జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడి బ్యాగు నుంచి రూ.23 లక్షలను ఎత్తుకెళ్లారు. నార్కెట్‌పల్లి వద్ద ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు ప్రయాణికులు దిగారు. అనంతరం బ్యాగు చూసుకుంటే మాయమైనట్లు బాధితుడు తెలిపాడు. దీంతో నార్కెట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.