ఏటీఎం చోరీ యత్నం.. దొంగ అరెస్ట్

ఏటీఎం చోరీ యత్నం.. దొంగ అరెస్ట్

అనంతపురం: పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎమ్‌లో చోరీ చేయడానికి ప్రయత్నించిన సాయికుమార్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి ఏటీఎం తలుపులు తీయడానికి ప్రయత్నించిన సమయంలో సైరన్ మోగడంతో నిందితుడు పారిపోయాడు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో త్రీ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితున్ని పట్టుకున్నారు.