31 కేజీల గంజాయిని సీజ్ చేసిన పోలీస్
TPT: చంద్రగిరి మండలం పనపాకంలో భారీగా గంజాయి పట్టుకున్నారు. సుమారు 6 లక్షలు విలువ చేసే 31 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు తమిళనాడుకు చెందిన పొన్ను స్వామి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బొలెరో వాహనంలో ఎవరికి తెలియకుండా డాష్ బోర్డు గేర్ బాక్స్, వెనుక టైర్ ఉండే ప్రాంతంలో గంజాయిని దాచి రవాణా చేస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు.