'సమస్యను పరిష్కరించే వరకు పోరాటం చేద్దాం'

KNR: 'డంపు యార్డ్ హఠావో- కరీంనగర్ బచావో' అనే నినాదంతో డంప్ యార్డ్ బాధితుల సంఘం జేఏసీ సభ్యులు స్థానిక కోతి రాంపూర్‌లో సమావేశం నిర్వహించారు. అల్కాపూర్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు స్థానిక డంపు యార్డ్ బాధిత కాలనీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. డంపు యార్డ్ నుంచి వచ్చే పొగతో అనేక సమస్యలు వస్తున్నాయని, సమస్యను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామన్నారు.