'పదో తరగతిలో 100% ఫలితాలు సాధించాలి'
SRD: పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి, రాయికోడ్ మండల ప్రత్యేక అధికారి జగదీష్ అన్నారు. రాయికోడ్‌లోని మోడల్ స్కూల్ విద్యార్థులతో గురువారం ఆయన మాట్లాడారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.