ప్రమాదం.. కట్టెల ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ!

ప్రమాదం.. కట్టెల ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ!

BPT: సంతమాగులూరు మండల పరిధిలోని కొమ్మలపాడు-ఏల్చూరు గ్రామాల మధ్య గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ముందు వెళ్తున్న కట్టెల లోడు ట్రాక్టర్‌ను, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ట్రాక్టర్ రోడ్డు పక్కకు దూసుకెళ్లి పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.