రేపు జిల్లాకు చేరుకోనున్న అభ్యుదయం సైకిల్ యాత్ర

రేపు జిల్లాకు చేరుకోనున్న అభ్యుదయం సైకిల్ యాత్ర

SKLM: ప్రజాభాగస్వామ్యం తోనే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమవుతుందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అభ్యుదయం సైకిల్ యాత్ర మంగళవారం శ్రీకాకుళం నగరానికి చేరుతుందని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉ. 9 గంటలకు సింహద్వారం, డే అండ్ నైట్ కూడలి మీదుగా రామలక్ష్మణ, సూర్యమహల్, ఏడు రోడ్ల కూడళ్ల వరకు యాత్ర సాగుతుందని తెలిపారు.