పుట్టలమ్మ కుంటలో రూ. 5 లక్షల చేపల మృత్యువాత

పుట్టలమ్మ కుంటలో రూ. 5 లక్షల చేపల మృత్యువాత

JN: స్టేషన్ ఘన్ పూర్ శివారులోని పుట్టలమ్మ కుంట చెరువులో అనుమానస్పదంగా చేపలు మృత్యువాత పడ్డాయి. చెరువులో కిలోన్నర నుంచి 2 కిలోల వరకు బరువున్నా 2 టన్నుల చేపలు వందల సంఖ్యలో చేపలు నీటిపై తేలుతూ కనిపించాయని మత్స్య సొసైటి నాయకులు తెలిపారు. అయితే దీని వెనుక కుట్ర జరిగి ఉంటుందని, ఎవరైనా విషగుళికలు కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిలినట్లు తెలిపారు.