రామ్, రావిపూడి కాంబోలో కొత్త సినిమా?

రామ్, రావిపూడి కాంబోలో కొత్త సినిమా?

దర్శకుడు అనిల్ రావిపూడితో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో 'రాజా ది గ్రేట్' సినిమా రావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా రవితేజ చేశాడు. ఇప్పుడు మళ్లీ వీరి కాంబో రాబోతున్నట్లు సమాచారం. ఇక రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా', అనిల్ 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాల తర్వాత ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.