మహేశ్వరంలో 30 పంచాయతీలకు 194 నామినేషన్లు
RR: మహేశ్వరం మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎంపీడీవో శైలజా రెడ్డి తెలిపారు. మొత్తం 30 గ్రామ పంచాయతీలకు 194, 258 వార్డులకు గానూ 813 నామినేషన్లు దాఖలైనట్లు ఆమె వెల్లడించారు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా టోకెన్లు జారీ చేసి, రాత్రి 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు.