భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

HYD: నాచారం డివిజన్ ఇందిరా నగర్‌లో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్‌లు పరిశీలించారు. మంచినీటి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. డ్రైనేజీ నిర్మాణాలతో ఇందిరానగర్‌లో పూర్తిగా డ్రైనేజీ సమస్యలు తొలగిపోతాయని కార్పొరేటర్ తెలిపారు.