ALERT: మూడు రోజులు జాగ్రత్త
TG: రాగల మూడు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు పెరగొచ్చని తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంది.