మృతుల కుటుంబాన్ని పరామర్శించిన మహిళ కమిషన్ ఛైర్మన్

కృష్ణాజిల్లా మొవ్వ గ్రామంలో వరకట్న వేధింపులకు ప్రాణాలు కోల్పోయిన నూతన వధువు పల్లికొండ శ్రీవిద్య కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ పరామర్శించారు. పెళ్లయిన మూడు నెలలకే మరణించడం బాధాకరమని.. అత్తింటివారు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా హింసించి ఆమె మరణానికి కారణమయ్యారని అన్నారు.