చేగుర్తి సర్పంచ్‌గా సరోజన విజయం
కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితం వెలువడింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భాషవేణి సరోజన ఘన విజయం సాధించారు. సరోజన గెలుపొందడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. తన గెలుపునకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావుకు, పార్టీ పెద్దలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.