ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

యాదాద్రి: బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో శుక్రవారం మార్నింగ్ వాక్‌లో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, గ్రామ సమస్యలను తెలుసుకుంటారు. 11 గంటలకు బొమ్మలరామారంలో రేషన్ కార్డుల పంపిణీ చేస్తారు. 12 గంటలకు కాజీపేట గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తుర్కపల్లిలో రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.