నేడు మూడో విడత అభ్యర్థుల గుర్తులు వెల్లడి
SDPT: మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 17న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులకు నేడు గుర్తులు కేటాయించనున్నారు. దీంతో అభ్యర్థుల గుండెల్లో గుబులు మొదలైంది. ఎన్నికల అధికారులు పేర్ల ఆధారంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులు కేటాయిస్తున్నారు. ఓటర్లు సులువుగా గుర్తుపట్టే గుర్తు వస్తే బాగుండునని అంటున్నారు.