VIDEO: లారీ బీభత్సం.. 10 బైకులు ధ్వంసం
ELR: కొయ్యలగూడెం వద్ద జాతీయ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన లారీ బీభత్సం సృష్టించింది. స్థానికుల కథనం మేరకు.. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ, రోడ్డు మార్జిన్ పక్కన పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఢీకొట్టింది. 10 బైకుల మీదుగా లారీ దూసుకుపోవడంతో ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో పలువురు వాహనదారులు గాయాల పాలయ్యారు.