మారుమూల గ్రామాల్లో తాగునీటి పథకాలు ప్రారంభం

ASR: కొయ్యూరు మండలంలోని మారుమూల బాలరేవుల, పోతవరం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన తాగునీటి పథకాలు బుధవారం ప్రారంభమయ్యాయి. నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో రూ.11లక్షల వ్యయంతో నిర్మించిన రెండు వాటర్ ట్యాంక్లను సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ, వార్డు సభ్యులు సంజీవ్ ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న తాగునీటి కష్టాలు నేటితో తీరాయని సర్పంచ్ తెలిపారు.