రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్

రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్

ELR: నూజివీడులో రూరల్ ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి రహదారి ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు నిర్వహించారు. నిద్రమత్తులో ఉన్న వాహనదారులకు ఫేస్ వాష్ చేయించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.