ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. అమ్మాయి మిస్సింగ్

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. అమ్మాయి మిస్సింగ్

CTR: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ప్రేమగా మారిన ఘటన ఇది. చిత్తూరు వన్ టౌన్ పరిధిలోని బాలిక(17)కు పాకాల మండలం దామల చెరువుకు చెందిన ప్రవీణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఈనెల 23న బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ వద్ద బాలిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు బాలికను వెంట తీసుకెళ్లడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.