మంచినీటి పరీక్షలను తనిఖీ చేసిన ఎంపీడీఓ

మంచినీటి పరీక్షలను తనిఖీ చేసిన ఎంపీడీఓ

SKLM: జి.సిగడాం మండల పరిధిలో శేతుభీమవరం గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్న మంచి నీటి పరీక్షలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.రామకృష్ణరావు మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం గ్రామాల్లో ఉన్న మంచి నీటి బోరులలో నీటికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌కి సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.