VIDEO: రహదారిపై గుంతలు.. తప్పని అవస్థలు
NGKL: బిజినపల్లి -మంగనూరు ప్రధాన రహదారిపై వెలుగొండ గేట్ వద్ద భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఆరు నెలలుగా గుంతలు పడినా ఆర్అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.