ధర్మాపూర్‌లో పీఎం సూర్యఘర్ పథకం అమలు

ధర్మాపూర్‌లో పీఎం సూర్యఘర్ పథకం అమలు

VKB: కొడంగల్ మండలం పరిధిలోని ధర్మాపూర్ గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేపడుతున్నారు. మొదటి దశలో RCC రూఫ్‌టాప్ ఉన్న ఇళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం గ్రామమంతా ఈ పథకాన్ని విస్తరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోలార్ ప్యానెళ్ల వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు వెల్లడించారు.