పెద్దమ్మ తల్లికి శాఖాంబరీ దేవి అలంకరణ

BDK: పాల్వంచ మండలం కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానంలో నేడు (ఆదివారం, జూలై 20) ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారిని శ్రీ శాఖాంబరీ దేవిగా అద్భుతంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులు, దాతల సహకారంతో పండ్లు, కూరగాయలతో ఈ అలంకరణ చేపట్టారు. ఈ అద్భుతమైన అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవాలని పాలకమండలి భక్తులను కోరింది.