గడియారం చౌరస్తాలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా పరిసర ప్రాంతాలలో నూతనంగా వచ్చిన డాగ్ స్క్వాడ్‌తో వన్ టౌన్ సీఐ అప్పయ్య తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు, అక్రమంగా నిలువలు ఏమన్నా ఉన్నాయా అని తనిఖీలు చేపట్టారు. భద్రతను పటిష్ఠ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ చర్యలు చేపట్టామని తెలిపారు.