చాగలమర్రిలో కంటైనర్ ఢీ.. డ్రైవర్‌కు గాయాలు
NDL: చాగలమర్రి మండల కేంద్రంలో ఇవాళ కంటైనర్ వాహనం కల్వర్టును ఢీకొట్టింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనం టోల్ గేట్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో వాహనం ముందు భాగం దెబ్బతిందన్నారు. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయన్నారు. అతడిని ఆస్పత్రికి తరలించగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.