వంతెన పూర్తి చేయాలని భారీ నిరసన

మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం నాగావళి నదిపై చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పూర్ణపాడు లాబేసు వంతెనను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు మే 26 నుండి తమ నిరసనను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. వంతెన నిర్మాణ పనులు ప్రారంభమై 15 సంవత్సరాలు గడిచాయి. అయినప్పటికి ఇంతవరకు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.