విగ్రహ ప్రతిష్ట పూజలో పాల్గొన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు

విగ్రహ ప్రతిష్ట పూజలో పాల్గొన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు

ATP: పామిడి మండలం పాళ్యం తండా గ్రామంలో గురువారం శ్రీ మారెమ్మ దేవత, సింహ వాహన నందీశ్వర, శ్రీతల దేవి బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి, వారిని ఆశీర్వదించారు.