పెండింగ్ వేతనాలు చెల్లించాలని కార్మికుల నిరసన

పెండింగ్ వేతనాలు చెల్లించాలని కార్మికుల నిరసన

MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు పెండింగ్ వేతనాల కోసం సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా వేతనాలు లేక అష్టకష్టాలు పడుతున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేనియెడల నిరవధిక ఆందోళన తప్పదని హెచ్చరించారు.