VIDEO: కలుజు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు
నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాపూరు మండలంలోని గురువారం రాపూరు పెద్ద చెరువు కాలువ నవాపేట కలుజు వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. రోడ్డుపై నీరు భారీగా చేరుకోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానికులు వాహనదారులు కాస్త తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.