గర్భధారణ సమస్యలపై మహిళలకు అవగాహన
KDP: బి.కోడూరు మండలం వెలుగు కార్యాలయంలో గురువారం ICDS సూపర్‌వైజర్ సుగుణ, ఎంపీడీఓ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో మహిళలకు కౌమార దశలో గర్భధారణ సమస్యల గురించి అవగాహన నిర్వహించారు. చిన్న వయసులో వివాహాలు జరగడం, గర్భం దాల్చడంతో తల్లీబిడ్డ ఇద్దరూ అనారోగ్యానికి గురికావడమే కాకుండా అనేమియకి గురవుతారని తెలిపారు. బాల్యవివాహాలు అరికట్టడం వల్ల సమస్యలు రాకుండా చూడవచ్చన్నారు.