VIDEO: వేపాడ మండలంలో నేలకొరిగిన వరి పంట

VIDEO: వేపాడ మండలంలో నేలకొరిగిన వరి పంట

VZM: తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు వేపాడ మండలం మారికలో వరి పంట నేలకొరిగింది. ఈ మేరకు గ్రామంలో సుమారు 30 మందికి చెందిన వరి పంట నేలకొరిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పంట చేతికి వస్తుందనే సమయానికి తుఫాన్ వర్షాలు కారణంగా పంట నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సర్వే చేపట్టి నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు.