దేవరకొండ ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక

దేవరకొండ ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక

NLG: దేవరకొండలో ఏబీవీపీ నూతన నగర కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా నూతన నగర కార్యదర్శిగా పగిళ్ల విక్రమ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ABVP కన్వీనర్ జినుకుంట్ల జయంధర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతీయ పునర్నిర్మాణం అనేది కేవలం ప్రభుత్వ విధానాలతో సాధ్యం కాదన్నారు. ప్రతి యువకుడు జాతీయ ఐక్యతాభావంతో మెలగాలన్నారు.