నేరుగా ఓటీటీలోకి రవిబాబు కొత్త సినిమా
సీనియర్ నటుడు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఏనుగుతొండం ఘటికాచలం'. ఈ మూవీ నేరుగా ఈటీవీ విన్ వేదికగా నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది. దానికి 'నవ్వుకునేందుకు సిద్ధంగా ఉండండి' అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో అలీ, నరేశ్, కృష్ణ భగవాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.