ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు.. సీపీ కీలక ఆదేశాలు..!
HYD: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇంటర్, ఓపెన్ స్కూల్ పరీక్షల నేపథ్యంలో సీపీ రమేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 20 నుంచి 27 వరకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఉంటుందని తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలు గుమిగూడటంపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.