VIDEO: వాకలపూడి ప్యారీ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత

VIDEO: వాకలపూడి ప్యారీ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత

కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ప్యారీ ఫ్యాక్టరీ వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. ముందస్తు నోటీసు లేకుండా లాకౌట్ చేస్తున్నారని ఆరోపిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఫ్యాక్టరీని ముట్టడించారు. కార్మిక శాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్య తీరుపై కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.