ఇంజినీరింగ్ విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు

మేడ్చల్: ఇంజినీరింగ్ విద్యార్థి అదృశ్యమైన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నార్సింగి చెందిన తోట కిరణ్ కుమార్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కండ్లకోయలోనే ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటుండగా ఈనెల11న ఇంటికి వెళ్తున్నానని హాస్టల్లో చెప్పి ఇంటికి చేరలేదని ఫిర్యాదు చేశారు.