విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం
TPT: పెళ్లకూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. నందిమాల గిరిజన కాలనీకి చెందిన సాగి అనిల్ కుమార్, వరలక్ష్మి దంపతులు పాడి పశువులను కొనుగోలు చేసేందుకు దాచుకున్న సుమారు రూ. 3 లక్షల నగదు, 20 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండితో పాటు ఇంటిలోని వస్తు సామగ్రి అంతా అగ్నికి ఆహుతయ్యాయి. కష్టార్జితం కళ్లముందే బూడిదవ్వడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.