VIDEO: పాపికొండల్లో పర్యాటకుల సందడి
ASR: దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు భారీగా పర్యాటకులు తరలివెళ్లారు. శుక్రవారం 6 పర్యాటక బోట్లలో 435 మంది గోదావరి నదిలో విహారయాత్రకు వెళ్లినట్లు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులందరికి అవసరమైన సౌకర్యాలు కల్పించామన్నారు. ఉదయం వెళ్లిన బోట్లు సాయంత్రం 5 గంటలలోపు తిరిగి వస్తాయని వెల్లడించారు.