ఉరుసు మహోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

CTR: బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని హజరత్ బిస్మిల్లా షాఖాదరి 60వ ఉరుసు మహోత్సవానికి విచ్చేయాలని నిర్వాహకులు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి సన్మానించిన దర్గా కమిటీ సభ్యులు శుక్రవారం రాత్రి గంధం మెరవిని, 10వ తేదీ శనివారం జరగనున్న ఖవ్వాలి కార్యక్రమాలకు విచ్చేయాలని ఆహ్వానించారు.