'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు'

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకించింది. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అనే నినాదాన్ని కేంద్రం సమాధి చేసిందని సీపీఎం కార్యదర్శి డీ. వెంకన్న అన్నారు. పోరాడి సంపాధించుకున్న ఉక్కు కర్మాగారం బీజేపీకి మచ్చగా మిగిలిపోతుందని ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.