జాతీయ రహదారి ప్రాజెక్టు సర్వేను అడ్డుకున్న రైతులు
HNK: గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా దామెర మండలం ఊరుగొండ వద్ద శుక్రవారం సర్వే నిర్వహించారు. రైతులు సర్వే పరికరాలను లాక్కొని సర్వేను అడ్డుకున్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. తాము భూములు ఇచ్చేది లేదని, కోర్టులో కేసు వేశామని, తమకు అనుకూలంగా కోర్టు స్టే ఇచ్చిందన్నారు. మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇచ్చి భూములను తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.