కావలిలో ఘనంగా జలాభిషేకం

కావలిలో ఘనంగా జలాభిషేకం

NLR: కావలి లత హాల్ సెంటర్‌లో శ్రీ గంగా భవానీ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా సోమవారం ఘనంగా జలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. 901 కలశాలతో మహిళలు నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. గంగమ్మ ఆశీస్సులతో పాడిపంటలు బాగుండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, వచ్చే ఉగాది నాటికి పూర్తి చేస్తామన్నారు.