9న జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీలు

9న జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీలు

VZM: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన జిల్లాస్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీలను నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం గురజాడ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కుసుమంచి సుబ్బారావు, సుభద్రాదేవిలతో కలసి ఆయన గోడ పత్రికలను ఆవిష్కరించారు.