'ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'

'ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'

BHNG: ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గురువారం మోత్కూరులో 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా జరిగే గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరి పత్రాలను పంపిణీ చేసి సీఎంఆర్ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.