VIDEO: మహాలక్ష్మి అవతారంలో వాసవి మాత అమ్మవారు

AKP: మాడుగులలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరవ రోజైన మంగళవారం వాసవి మాత అమ్మవారు మహాలక్ష్మిగా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని లక్షల రూపాయల నోట్లతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి అవతారంలో ఉన్న వాసవి మాత అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.