FRS విధానాన్ని వెంటనే రద్దు చేయాలి: CITU

ADB: అంగన్వాడి సేవలకు తప్పనిసరిగా చేసిన ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్‌ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తాను ఉట్నూర్ మండల కేంద్రంలో సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. మొబైల్ నెట్‌వర్క్ సాంకేతిక లోపంతో ఓటీపీ అందక లబ్ధిదారునికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.